UPDATES  

 వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేములవాడ, అక్టోబర్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి):వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో న్యాయమూర్తులు, మహిళా న్యాయవాదులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ వేడుకలను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. వివిధ రకాల పూలను సేకరించి వరుస క్రమంలో అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేసినట్లుగానే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో మెలగాలని ఆకాంక్షించారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా అందరూ పరస్పర గౌరవంతో, కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. కోర్టులోని మహిళా న్యాయవాదులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొంటూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ.. పల్లెల్లో వికసించే ప్రతి పువ్వు ప్రకృతి అందాలను పెంచినట్లే, వివిధ పూలతో అలంకరించే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మను గౌరమ్మగా కొలుస్తూ భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణతో పాటు మొగిలి సుజాత, పడిగేల మమత, బూర సరిత, కొడిమ్యాల సంగీత, గుజ్జె అపర్ణ, జక్కుల పద్మ, స్రవంతి, ఆకుల మాధురి, కోర్టు సిబ్బంది జగ్ముగదేవి, సంధ్య, లత, జ్యోష్ణ, చైతన్య, అంజలి, ప్రత్యూష, కోర్టు సూపరింటెండెంట్ వెంకటేష్, అంజయ్య, కోర్టు ఏజీపీలు బొడ్డు ప్రశాంత్, భానుకృష్ణ హాజరయ్యారు.అలాగే బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొంటి శంకర్, జాయింట్ సెక్రటరీ కనికరపు శ్రీనివాస్, ట్రెజరర్ జెట్టి శేఖర్, నామాల రాజశేఖర్ రెడ్డి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మరుమోకం అనిల్, వడ్లకొండ శ్రీకాంత్, మాజీ అధ్యక్షులు గుండ రవి, పొత్తూరి అనిల్, నేరెళ్ల తిరుమల గౌడ్, సీనియర్ న్యాయవాదులు పురుషోత్తం, నక్క దివాకర్, మహేందర్ బొజ్జ, గుడిపెళ్లి మహేశ్, నేదూరి అభిలాష్, భీమ మహేష్ బాబు, సుంకెపాక నవీన్, పొత్తూరి జనార్దన్, పొత్తూరి మల్లేష్, కోర్టు అటెండర్ చిరంజీవి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 14 October 2026, 8:05 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest