సంతాపం తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. కాగా ఊకే అబ్బయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో బూర్గంపాడు నుంచి, 1994, 2009 లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అటు బూర్గంపహాడ్, ఇటు ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని, అబ్బయ్య ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, అబ్బయ్య కుటుంబానికి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Post Views: 94