డీజేయు ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా వేదికగా
జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు
ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధనే ధ్యేయంగా అడుగు ముందుకు వేస్తున్నాం
జర్నలిస్టుల హక్కుల సాధనకు ప్రత్యేక ఉద్యమం
డిజేయు జాతీయ కన్వీనర్ బి. లక్ష్మీనర్సింహా
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి డీజేయు యూనియన్ కృషి చేస్తుందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం టిఎస్ యూటిఎఫ్ కార్యాలయంలో సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన కో-ఆర్డినేటర్స్ చెంగపోగు సైదులు, అఫ్జల్ పఠాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్(డిజేయు) జాతీయ కన్వీనర్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతు జర్నలిస్టుల నైపుణ్యతను వెలికి తీసేందుకు డీజేయు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తరగతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధన లక్ష్యంగా అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేసేందుకు డీజేయు సిద్ధంగా ఉందన్నారు. గతంలో జర్నలిస్టుల కోసం పనిచేసిన యూనియన్లు కాలయాపన చేస్తూ సంక్షేమాన్ని వీడిందని దీన్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల కోసం డీజే యు ఉద్భవించింది అన్నారు. జర్నలిస్టులకు అవసరమైన ఇల్లు ఇళ్ల స్థలాలు సాధించేందుకు అర్హతలు బట్టి అక్రిడేషన్ కార్డుల మంజూరు, ప్రత్యేక శిక్షణ తరగతులు, తదితరవి ప్రణాళిక బద్ధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డీజే యు ఆధ్వర్యంలో నిర్వహించనున్నామన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పని చేసే యూనియన్లను నమ్ముకోవాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరి స్వలాభం కోసమో స్వార్థం కోసమో డీజే యు ఏర్పాటు జరగలేదని దేశవ్యాప్తంగా జర్నలిజం లో ఎంతో అనుభవం ఉన్న మేధావుల రూపకల్పనే డీజేయు అన్నారు. ప్రధానంగా దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు చట్టపరిధిలో పోరాడి ప్రత్యేక చట్టం తెచ్చేందుకు డీజేయు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. యూనియన్ లో సభ్వత్వం ఉన్న పాత్రికేయులు ఆకస్మికంగా మరణిస్తే యూనియన్ నుండి 50 వేల రూపాయలను కుటుంబానికి అందివ్వడం జరుగుతుందని , ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో అంగవైకల్యం చెందిన జర్నలిస్టులకు ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలను సహాయం చేస్తుందని, ఆడపిల్ల కళ్యాణ నిమిత్తం 2 లక్షల రూపాయలను డిజెయు యూనియన్ అందిస్తుందని, డిజెయు యూనియన్ నుండి 15 లక్షల హెల్త్ భీమా అందివ్వడం జరుగుతుందన్నారు. సభ్యులకు అన్ని వేళలా యూనియన్ నాయకులు అందుబాటులో ఉంటు వృత్తిపరమైన సహాయ సహకారలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, మౌలాలి, లక్ష్మణ్ రావు, కృష్ణ, వెంకట్, వినోద్, సతీష్, హనుమంత్, శివ రామకృష్ణ, కవటం శ్రీనివాస్, ఉమాకాంత్, సురేష్, కంచు శ్రీనివాస్, ప్రసాద్, సురేందర్, అజ్మత్, ఇమాన్యూల్, షఫీ తదితరులు పాల్గొన్నారు.