రవిచంద్ర నాయకత్వం లోనే పని చేస్తాం
తెలంగాణ వాణిలో వచ్చిన కథనంపై వనమా రాఘవ ఖండన
కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి)
రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం, గత ఎన్నికల్లో మా నాన్న వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం మన ప్రియతమ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో నిద్రాహారాలు మాని వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం ఆయన పడ్డ కష్టాన్ని తాను దగ్గరుండి చూసానని వనమా రాఘవేంద్ర అన్నారు. ఈరోజు నిరాధారంగ తెలంగాణ వాణిలో వచ్చిన కథనం సరైంది కాదని, కావాలని కొంతమంది తమ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తు ఇలాంటి వార్తలు వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్లే ఇదంతా జరుగుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర లు మా కుటుంబం పట్ల చూపిన ఆప్యాయత అనురాగం మరువలేనివని వారి నాయకత్వంలోనే తాము నడుస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ లను పట్టించుకోకుండా పార్టీని బలోపేతం చేసేందుకు వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో ముందుకు పోదామని వనమా రాఘవ పిలుపునిచ్చారు.