UPDATES  

 జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారని, అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉండగా కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతమవుతున్నారన్నారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందని, గత ప్రభుత్వం కొత్తగూడెం జర్నలిస్ట్ ల కోసం స్థలాన్ని సేకరించినప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పగించడంలో జాప్యం చేసిన విషయాన్ని మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలోనైన జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ తరపున విన్నవించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest