పాల్వంచ (తెలంగాణ వాణి)
పాల్వంచ మండలంలోని
కిన్నెరసాని అటవీ ప్రాంతంలో గల రహదారి కూడా లేని గడ్రబంధం గ్రామాన్ని ట్రాక్టర్ కొంత కాలినడకన ద్వారా గ్రామాన్ని చేరుకొని ఇటీవలే స్వర్గస్తులైన సిపిఐ నాయకులు మాజీ సర్పంచ్ తాటి రాధమ్మ భర్త తాటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం కలుగజేసి తాటి వెంకటేశ్వర్లు చిత్ర పటానికి పూలమాల వేసి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా నివాళులర్పించారు. అదే విధంగా గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకొని గ్రామానికి అందవలసిన సంక్షేమ, అభివృద్ధి కోసం నిధులను మంజూరు కొరకు తప్పకుండా ప్రయత్నం చేస్తానని పూర్తి స్థాయిలో గ్రామాల్లో సంక్షేమ పథకాలు అదెలా చూస్తానని వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, తర సింగ్ లక్ష్మీపతి, దారా శ్రీను, దేవరగట్ల రాంబాబు, జలీల్ పాషా, కట్టెం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ జోగ రాజబాబు, లక్ష్మి నారాయణ, మాజీ ఎంపీటీసీ రాంబాబు, గ్రామస్తులు ఉన్నారు