UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 జర్నలిస్టు సాంబపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: డీజీపీ ని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిది) ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జర్నలిస్టులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గం అని టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ఏ మీడియా స్వేచ్ఛ హక్కును హరించే దిశగా ఇటు ప్రభుత్వం అటు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను రిపోర్టు చేస్తున్న ఖమ్మం జిల్లా టి.న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివ రావుపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ లు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు సాంబ శివరావుపై అక్రమ కేసుకు నిరసనగా సోమవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టి.న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ ఈ సాంబశివరావుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేశారని డీజీపీకి తెలిపారు. తాను కేసు వివరాలు తెలుసుకొని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని డీజీపీ తనను కలిసిన జర్నలిస్టు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలిపి,డీజీపీని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి పి.యోగానంద్, యార నవీన్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రాకేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, కోశాధికారి బాబురావు, రాష్ట్ర నాయకులు సూరజ్ భరద్వాజ్, శివారెడ్డి, శ్రీధర్ ప్రసాద్, భాస్కర్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, సిరికొండ అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.

 

“మంత్రి పొంగులేటిని కలిసి వినతి”

 

జర్నలిస్టు సాంబశివరావు పై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టియుడబ్ల్యూజే నాయకులు సచివాలయంలో కలిసి కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొని జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest