UPDATES  

NEWS

 కాళేశ్వరం పుష్కరాల ఎఫెక్ట్ బస్సుల కొరత వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

రెగ్యులర్ స్థాప్ లలో బస్సులు ఆపాలని ప్రయాణికుల డిమాండ్

భూపాలపల్లి (తెలంగాణ వాణి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ స్టాప్ లలో స్పెషల్ బస్సులు ఆపక పోవడంతో బస్సుల్లేక‌ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ, భూపాలపల్లి, ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ బస్సు సర్వీసులు తగ్గడంతో, వచ్చే బస్సులు సీటింగ్ కేపాసిటీ వరకు ప్రయాణికులతో వెళ్తున్నా స్టాప్ ల వద్ద ఆపకపోవడంతో రేగొండ, గాంధీనగర్ ఎక్స్ రోడ్, చెల్పూర్ భూపాలపల్లిలో కాటారం, బస్వాపూర్, చెన్నూర్, హన్మకొండ వెళ్ళేవారు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. హన్మకొండ, నర్సంపేట తదితర ప్రాంతాల నుండి కాళేశ్వరంకు డైరెక్ట్ బస్సులు నడుస్తున్నా మధ్యలో స్టాప్ లేక ఆపకపోవడంతో ప్రయాణికులకు ఎండమావి కష్టాలతో ఎదురు చూపులు తప్పడం లేదు. సరస్వతి పుష్కరాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పరకాల ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతుంది. బస్సుల్లేక‌ చాలా సేపటి నుండి ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  1. ప్రయాణికుల ఇబ్బందులు

 

బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల కోసం చాలాసేపు వేచి చూస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో బస్సు సర్వీసులు లేకపోవటంతో ప్రయాణికులు నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రయాణికులు కోరుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest