31న హైదరాబాద్ లో జరిగే రజతోత్సవ వేడుకలకు జర్నలి స్టులు తరలి రండి.
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపు.
ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి)
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజెఎఫ్) 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ఈనెల 31న హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే టి జె ఎఫ్ వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ,గృహ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించారు. రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ చిర్రా రవి లు మాట్లాడుతూ ఈనెల 31న హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాలను నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరా వాలని వారు పిలుపునిచ్చారు.
24న ఆర్ టి ఐ కమిషనర్ సీనియర్ జర్నలిస్ట్ పి.వి. శ్రీనివాస్ రావు కు అభినందన సభ
ఈ నెల 24న ఆర్ టి ఐ కమిషనర్ సీనియర్ జర్నలిస్ట్ పి.వి.శ్రీనివాస్ రావు కు ఖమ్మంలో ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి శెట్టి రజనీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, వనం నాగయ్య, మందుల ఉపేందర్, దుంపల భాస్కర్, శ్రీధర్ శర్మ, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, నరాని సాయి, కెమెరామెన్ల సంఘం పృద్వి, గడ్డం సతీష్ శంకర్, నాయకులు వెంకటకృష్ణ, పిసిడబ్ల్యూ నరేష్, పొన్నెబోయిన పానకాలరావు, ఉల్లోజు రమేష్ , ఇసంపల్లి వెంకటేశ్వర్లు, నల్లమోతు శ్రీనివాస్, వెంపటి నాయుడు, రాజేందర్ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు.