ఆ స్కూల్ కూల్చొద్ధంటున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ (తెలంగాణ వాణి) కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కానీ ఆ స్కూల్ కూల్చకండంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించామని వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని గతంలో కూడా తనపై కాల్పులు జరిగాయని కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి […]
విచారణకు పిలిచి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్.. మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ఇది మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ […]
ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా […]
నాగార్జున “ఎన్” కన్వెన్షన్ కూల్చివేత…

హైడ్రా దృష్టిలో సినీ, రాజకీయ, బడబాబులు ఎవరైనా ఒక్కటే అంటున్న రంగనాధ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. […]
నా ఇల్లు అక్రమమైతే మీరే కూల్చేయండి

కేటీఆర్‌కు పొంగులేటి సవాల్ హైదరాబాద్ (తెలంగాణ వాణి) హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తన ఇల్లు ఇంచు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా టేప్ పెట్టి కొలిచి కూలగొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని కోరారు. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావు తన ఇల్లు FTL, బఫర్ జోన్‌లో ఉందని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. […]
కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

న్యూఢిల్లీ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆరోగ్యం నిలకడ అయిన […]
డ్రైడే ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

బెల్లంపల్లి (తెలంగాణ వాణి) డ్రై డే–ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా హనుమాన్ బస్తి -28వ వార్డులో డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చేయించారు. ఇంటీంటికి వెళ్ళి ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలిగించాలని, పాత పాత్రలలో, టైర్ లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుబ్రముగా ఉంచుకోవాలని చూచనలు చేసి, జెసిబి తో పెద్ద కాలువలు తీయించి పిచ్చి మొక్కలు తొలిగించారు. ఈ కార్యక్రమముల చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమీషనర్ కె […]
జబ్బార్ మృతి తీరని లోటు

జబ్బార్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క ములుగు (తెలంగాణ వాణి) రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామానికి చెందిన మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకుడుగా పని చేసి ఇటీవల మరణించిన కొట్టేం వెంకటనారాయణ (జబ్బార్) ప్రథమ వర్ధంతి కి హాజరై ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు […]
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

ములుగు (తెలంగాణ వాణి) ములుగు పట్టణ కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు చిందం చందు తండ్రి చిందం రవీందర్ ప్రథమ వర్ధంతి కి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క రవీందర్ చిత్ర పటానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి దేవాలయంలో వనమా రాఘవ ప్రత్యేక పూజలు

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలోని శ్రీకనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి దేవాలయం) లో వనమా రాఘవేంద్రరావు పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వనమా రాఘవ వెంట BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్, పాల్వంచ BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, వాసుమల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.