UPDATES  

 కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడా ప్రతిభ 

జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో అగ్రస్థానాలు సాధించారు. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర డిస్క్ త్రోలో మొదటి స్థానం, బాలికల టేబుల్ టెన్నిస్‌లో మూడవ స్థానం, బాలుర 4×400 మీటర్ల పరుగు పోటీలో మూడవ స్థానం సాధించారు. మొత్తం బాలుర విభాగంలో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. విజేత విద్యార్థులను ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, విద్యుత్ విభాగాధిపతి తారాసింగ్, శారీరక విద్యాధికారి కృష్ణారావు , అధ్యాపకులు స్వప్న, కృష్ణ, ధరణి, సిబ్బంది సందీప్, కౌసల్య తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 4 February 2026, 11:30 pm Posted by : TELANGANA VANI

కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడా ప్రతిభ 

జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో అగ్రస్థానాలు సాధించారు. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర డిస్క్ త్రోలో మొదటి స్థానం, బాలికల టేబుల్ టెన్నిస్‌లో మూడవ స్థానం, బాలుర 4×400 మీటర్ల పరుగు పోటీలో మూడవ స్థానం సాధించారు. మొత్తం బాలుర విభాగంలో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. విజేత విద్యార్థులను ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, విద్యుత్ విభాగాధిపతి తారాసింగ్, శారీరక విద్యాధికారి కృష్ణారావు , అధ్యాపకులు స్వప్న, కృష్ణ, ధరణి, సిబ్బంది సందీప్, కౌసల్య తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest