హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మాజీ ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన అడ్వయిజర్ పోస్టులు ఇచ్చినందున నాలుగింటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. సామాజికవర్గాల రీత్యా చూస్తే బీసీల్లో మున్నూరుకాపు, ముదిరాజ్, రజక, ఎస్సీ(మాల), ఎస్టీ (లంబాడా), రెడ్డి కులాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి…