UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

సుజాతనగర్ లో అంబరాని అంటేలా సంబరాలు 

విజేతలకు బహుమతులు అందించిన తోట దేవిప్రసన్న, ఆళ్ల మురళి

సుజాతనగర్ / కొత్తగూడెం (తెలంగాణ వాణి) బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ సుజాతనగర్ లో ఆదివారం సాయంత్రం ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు’ భద్రాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలు ‘చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా.. అందాల బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’ అంటూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని జెండాల సెంటర్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పలువురు మహిళా నాయకులతో పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం వాణి రెడ్డి, రమాదేవి, సంధ్య, రాజ్యలక్ష్మి, అరుణ తదితరులతో కలిసి సంస్కృతి-సాంప్రదాయం కనబడేలా సుందరంగా బతుకమ్మలను పేర్చిన ముగ్గురిని విజేతలుగా నిర్ణయించగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, దేవిప్రసన్న తదితరులతో కలిసి వారికి పట్టు చీరలు బహుకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి వచ్చిన నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, సోసైటీ చైర్మన్ మండే హనుమంత్ రావు, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్స్ ఎండి రజాక్, పితాంబరం, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఐవైసి కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీకాంత్, సుజాతనగర్ నాయకులు మడుపల్లి శ్రీనివాసులు గౌడ్, లోశెట్టి నాగార్జున, ఎస్కె అబిద్, సాధుల నర్సింహారావు, చిమట నాగేశ్వరరావు ఎస్కె మౌలా సాహెబ్, చుంచుపల్లి మండల మాజీ అధ్యక్షులు కున్సోత్ కిషన్, లక్ష్మీదేవిపల్లి మండల నాయకులు పూణేం శ్రీనివాస్, బాల పాసి, బాలిశెట్టి సుందర్ రాజు, పోస్ట్ ఆఫీస్ వాసు, కేకే శ్రీను, మందా హనుమంత్, జానీ భాయ్, యూత్ కాంగ్రెస్ శ్రేణులు కసనబోయిన రామ్మూర్తి, జీడి మహేష్, కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest