UPDATES  

NEWS

 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

భద్రాచలం (తెలంగాణ వాణి) అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సమాచారం ప్రకారం చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల సమయంలో కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డీవో సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అటవీ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 7 May 2026, 4:11 pm Posted by : TELANGANA VANI

10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

భద్రాచలం (తెలంగాణ వాణి) అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సమాచారం ప్రకారం చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల సమయంలో కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డీవో సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అటవీ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest