అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (నవంబర్ 08 ) : “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తైన ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని, అల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, భీమారం, హనుమకొండ క్యాంపస్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆరాధనీయంగా ఆలపించి, భారత మాత పట్ల తమ అపారమైన ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతను వ్యక్తపరిచారు.క్యాంపస్ అంతటా దేశభక్తి గానాలతో మార్మోగి […]
రహదారిపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందర ప్రధాన రహదారిపై మొక్కజొన్న రైతులు రోడ్డుపై బైఠాయించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమశాతం చూడడం లేదని మొక్కజొన్నలు తూకం కూడ ఆలస్యంగా చేపడుతున్నారని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారిని లావణ్య రోడ్డుపై బైఠాయించిన రైతుల వద్దకు వచ్చి తేమ శాతాన్ని పరిశీలించి 14 తేమశాతం వచ్చిన మొక్కజొన్నలు సీరియల్ ప్రకారము తూకం వేస్తారని […]
శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని

ధర్మారం ( తెలంగాణ వాణి విలేకరి) కరీంనగర్ లో ప్రసిద్ధిగాంచిన ఇంటర్మీడియట్ విద్యాసంస్థల శ్రీ చైతన్య ఐఐటి- జేఈఈ, నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులలో ప్రతిభ వెలికి తీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆదివారం కరీంనగర్ లో నిర్వహించిన స్కాలర్ షిప్ టాలెంట్ టెస్ట్ 2025 కు గాను రికార్డ్ స్థాయిలో 12,519 మంది విద్యార్థులు నమోదు చేసుకొని హాజరయ్యారు. శ్రీ చైతన్య సంస్థలకు చెందిన పది కళాశాలలలో ఈ పరీక్షలను అత్యధిక నమోదు శాతంతో […]
టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరుబాట మొదలుపెట్టిన తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకు స్థాపించిన నూతన సంఘంలో ఉపాధ్యాయ సమస్యలపై, విద్యారంగ వ్యవస్థపై అవగాహన కలిగిన జాడీ శ్రీనివాస్ ను తొలి […]
వనమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బట్టు మంజుల
పాల్వంచ (తెలంగాణ వాణి) శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు ను శాలువాతో సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షురాలు బట్టు మంజుల జ్ఞాపిక అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ సీనియర్ నాయకులు, ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత, వనమా వెంకటేశ్వర రావు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నెరువట్ల రాజయ్య

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు నెరువట్ల రాజయ్య తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి […]
చుంచుపల్లిలో జననేత వనమా జన్మదిన వేడుకలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా చుంచుపల్లి మండలంలోనీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వనమా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత మాజీ మంత్రి వనమా కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో […]
బాలెబోయిన రాజు మృతి

నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మండలంలోని తెలగ రామవరం గ్రామానికి చెందిన బాలెబోయిన రాజు మరణించారు. విషయం తెలుసుకున్న తూము చౌదరి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, మృతుని కుటుంబాన్ని పరామర్శించి, అండగ ఉంటామని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును […]
క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య

స్నేహితులను నమ్మి ఫండ్ లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ నగరంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు ) వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. మంకమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశాడు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ […]
ఎమ్మార్పీఎస్ ధర్మారం మండల కమిటీ నియామకం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండల శాఖ అడహాక్ కమిటీని జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ నియమించారు. మండల కన్వీనర్ గా కమ్మరి ఖాన్ పేట గ్రామానికి చెందిన ఇరుగురాల మహేష్, కో కన్వీనర్ గా కొత్తూరు గ్రామానికి చెందిన నేరువట్ల అభిలాష్, మండల ఇన్చార్జిగా మద్దునాల మల్లేశం లను నియమించినట్లు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మా నియామకానికి సహకరించిన […]