UPDATES  

NEWS

తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్ధినులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని వారి తల్లిదండ్రులు మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ కి ఫోన్ చేసి సమస్యలను వివరించగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యాలయంలోని వంట గది మరియు విద్యార్థులు త్రాగే నీరు, తినే ఆహారాన్ని పరిశీలించారు. విద్యాలయంలో ప్రస్తుత దుర్బర పరిస్థితిని మరియు విద్యార్థినిలు తినే ఆహారం వారు వారి […]

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునికి ఘన సత్కారం  ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి నిజాంసాగర్ మండలం నందు కాంగ్రెస్ పార్టీ డిసిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నెంబర్ లింగమయ్య మాజీ ఉపసర్పంచ్ యాదగిరి గౌడ్ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రైతుల పట్ల నిబద్ధతను మరోసారి చాటిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకుల తొలగింపు పనులకు రూ. 2.08 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కీలక విజయం సాధించారు.నాగిరెడ్డిపేట మండల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకుల […]

లక్ష్మీదేవిపల్లి లో సమీక్ష సమావేశం…పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో సుస్మితా

లక్ష్మీదేవిపల్లి మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి సుస్మితా అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల్లో కొత్త నర్సరీల ఏర్పాటు,పారిశుద్ధ్య పనుల అమలు,మంచినీటి,పన్నుల వసూలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సంబంధిత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్,వీరన్న,ఈ సి సత్యనారాణ,సెక్రెటరీ సాంబయ్య,వివిధ పంచాయతీ సెక్రటరీలు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ చొరవతో పంచాయతీలో వెలిగిన దీపాలు..

పాల్వంచ : వీధులు చీకటిమయంగా లేకుండా, పిల్లలు,పెద్దలు, మహిళలు బయటకు వెళ్లాలంటే రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఉండుటకు పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు గ్రామ పంచాయతీ సర్పంచ్ అజ్మీరా మహేశ్వరి శ్రీనివాస్ విధి దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో మరో ఉపఎన్నిక

తెలంగాణలో మరో ఉపఎన్నిక కవిత రాజీనామాకు ఆమోదం   హైదరాబాద్ (తెలంగాణ వాణి) జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గతేడాది సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.   2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితకు 2028 వరకు […]

గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి చాతకొండ ఇసుక అక్రమ రవాణా బాధితురాలికి న్యాయం చేయండి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్  కొత్తగూడెం (తెలంగాణ వాణి) లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. […]

శ్రీ చైతన్య టెక్నో ఇన్స్టిట్యూషన్ లో హ్యాపీ క్లబ్–షేరింగ్ అండ్ కేరింగ్

ఖమ్మం:ఎన్‌టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య స్కూల్–1 బ్రాంచ్‌లో విద్యార్థుల మానసిక ఉల్లాసం, పరస్పర సహకార భావన పెంపొందించే ఉద్దేశంతో హ్యాపీ క్లబ్–షేరింగ్ అండ్ కేరింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పిల్లల్లో సామాజిక, భావోద్వేగ వికాసం సాధ్యమవుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.విద్యార్థులు రంగురంగుల వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మాజీ సర్పంచ్ రవి ఆధ్వర్యంలో మహిళలకు ఘన సత్కారం రాయికల్ (తెలంగాణ వాణి) మహిళలు విద్య,రాజకీయ,సామాజిక సేవా రంగాల్లో రాణించాలని రామాజిపేట మాజీ సర్పంచ్,రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి అన్నారు.మండలం లోని రామాజిపేట గ్రామ రామాలయ కళ్యాణ మండపం లో మాజీ సర్పంచ్ వాసరి రవి ఆధ్వర్యంలో గ్రామం లో నూతనంగా ఎన్నికైన మహిళ వార్డు సభ్యులను,ఐకేపీ మహిళ సంఘ ప్రతినిధులను,సి.ఎ లను, ఎ.ఎన్.ఎమ్,ఆశ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ […]

డ్రగ్స్ తీసుకున్న ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న అనంతరం డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని స్థానిక పోలీస్ స్టేసన్‌కు తరలించి […]