UPDATES  

ప్రభుత్వంపై స్వరం మార్చిన కూనంనేని

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)   కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ రంగనాథ్ మంచి మనిషి అని… పనిలో స్పీడ్ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, శికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]

తప్పని తెలీతే నేనే కూల్చేస్తా : ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) కొత్వాల్ గూడలోని తన ఫాంహౌస్ అక్రమ నిర్మాణమంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడారు. కొత్వాల్ గూడలోని సర్వే నెం.13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005 లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి, […]

ఆ స్కూల్ కూల్చొద్ధంటున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ (తెలంగాణ వాణి) కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కానీ ఆ స్కూల్ కూల్చకండంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించామని వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని గతంలో కూడా తనపై కాల్పులు జరిగాయని కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి […]

బజాబ్ ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్ ఆగడాలు

ఈఎంఐ కట్టలేదని కోడిని ఎత్తుకెళ్లారు కొత్తగూడెం (తెలంగాణ వాణి) బజాజ్ ఫైనాన్స్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ లోన్, లేదా పర్సనల్ లోన్ తీసుకున్నారా ? జాగ్రత్త ఈఎంఐ కట్టడం అసలు మిస్ చేసుకోకండి. ఖర్మ కాలి ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంక్ లో చెక్ బౌన్స్ ఛార్జ్, బజాజ్ లో లేట్ పేమెంట్ ఛార్జ్ మాత్రమే కాకుండా రికవరీ ఏజెంట్ లకు కూడ ఏదో ఒక విధంగా ఛార్జ్ కట్టాల్సిందే. చెక్ బౌన్స్, లేట్ పేమెంట్ […]

వసుంధర రైస్ మిల్లు వద్ద నీటి వరద

కోదాడ (తెలంగాణ వాణి) అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ పరిధిలోని శ్రీ వసుంధర రైస్ మిల్లు వద్ద గల జాతీయ రహదారిపై వరద నీళ్లు నిలిచి ఉండటంతో వాహనదారులకు రాకపోకలకు ప్రమాదంగా మారింది. దీనిపై అధికారులు స్పందించి నిలచిన వరద నీటిని తొలగించాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరారు.

మాకు హైడ్రా కావాలంటున్న భద్రాద్రి జిల్లా ప్రజలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) చెరువలను, కుంటలను కబ్జా చేసి విలాసవంతమైన భావనాలు నిర్మించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్, సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న రంగనాధ్ IPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా చేస్తున్న సంస్కరణలకు తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక పరపతితో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూ మా నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎన్ని విధాలుగా ఫిర్యాదులు చేసిన వాళ్లకు భయపడి […]

గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి

ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు మణుగూరు (తెలంగాణ వాణి) మణుగూరు గనుల సమీపంలోని బెల్ట్ షాపులు కార్మికులను రా -రమ్మని ఆకర్షిస్తు ప్రమాదాలకు కారణభూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందించినట్టు బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

విచారణకు పిలిచి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్‌.. మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ఇది మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ […]

ఒకేసారి టీ.పీసీసీ అధ్యక్షుడు, కొత్త మంత్రుల పేర్ల ప్రకటన

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కొత్త సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ఒకేసారి కొత్త అధ్యక్షుడి పేరుతో పాటు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్‌గా బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు లీకులు వెలువడ్డాయి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా […]

నాగార్జున “ఎన్” కన్వెన్షన్ కూల్చివేత…

హైడ్రా దృష్టిలో సినీ, రాజకీయ, బడబాబులు ఎవరైనా ఒక్కటే అంటున్న రంగనాధ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతను హైడ్రా అధికారులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. […]