తిమ్మాపూర్, నవంబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):ఈ నెల 29న అలుగునూర్లోని ఎనిమిదో డివిజన్లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సభ నిర్వహణ ఏర్పాట్లకు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లను ప్రారంభించి, సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మానకొండూరు, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రావుల రమేష్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ పాశం అశోక్‌రెడ్డి, 8వ డివిజన్ అధ్యక్షుడు సల్ల మహేందర్, ముత్తమల్ల నిఖిల్, యాస్వాడ శ్రీకాంత్, వెంకటేశం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





