UPDATES  

NEWS

 బాలల భవిష్యత్తే దేశ భవిష్యత్తు.. వారి ఆరోగ్యమే మా ప్రాధాన్యత!

  • అంతర్గాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు
  • విద్యార్థులకు రక్తపరీక్షలు.. మత్తు పదార్థాల నివారణపై అవగాహన..
  •  ప్రతిభావంతులకు బహుమతులు, ఉపాధ్యాయులకు ఘన సన్మానం

పెద్దపల్లి, నవంబర్ 13 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి)

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి జిల్లా జవహర్ బాల మంచ్ చైర్మన్ అలకుంట రాజేశం ఆధ్వర్యంలో అంతర్గాం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రామగుండం సీఐ, రామగుండం ఎస్ఐ, అంతర్గాం ఎస్ఐ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు విలువైన సందేశాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర జవహర్ బాల మంచ్ కోఆర్డినేటర్ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత

జవహర్ బాల మంచ్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్తపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పోలీస్ అధికారులతో కలిసి “మత్తు పదార్థాలకు నో చెప్పండి” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. ఉపాధ్యాయులకు సన్మానం

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా అలకుంట రాజేశం మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తు.. వారి ఆరోగ్యం, విద్య, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు రాణించాలని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆరోగ్య, విద్యాభివృద్ధికి జవహర్ బాల మంచ్ తరఫున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి ఐ. కృష్ణ కుమార్ ఏస్ ఐ ఉదయ్ కిరణ్,అంతర్గాం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం కిరణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, డీసీసీ ప్రధాన కార్యదర్శి పుదారి సత్తయ్య, అంతర్గాం సర్పంచ్ ఆంగోత్ రవికుమార్, బారుపటి శ్రీను, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లగిశెట్టి రాకేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకాంబరం, జేబీఎం రామగుండం నియోజకవర్గ నాయకుడు దొబ్బల తరుణ్ కుమార్, మండల సమన్వయకర్తలు అలకుంట శ్రీనివాస్, బానోత్ కార్తీక్ నాయక్ తదితరులు, జేబీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 13 November 2026, 10:59 pm Posted by : TELANGANA VANI

బాలల భవిష్యత్తే దేశ భవిష్యత్తు.. వారి ఆరోగ్యమే మా ప్రాధాన్యత!

అంతర్గాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు
విద్యార్థులకు రక్తపరీక్షలు.. మత్తు పదార్థాల నివారణపై అవగాహన..
 ప్రతిభావంతులకు బహుమతులు, ఉపాధ్యాయులకు ఘన సన్మానం

పెద్దపల్లి, నవంబర్ 13 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి)

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి జిల్లా జవహర్ బాల మంచ్ చైర్మన్ అలకుంట రాజేశం ఆధ్వర్యంలో అంతర్గాం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రామగుండం సీఐ, రామగుండం ఎస్ఐ, అంతర్గాం ఎస్ఐ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు విలువైన సందేశాలు అందించారు. తెలంగాణ రాష్ట్ర జవహర్ బాల మంచ్ కోఆర్డినేటర్ ప్రవీణ్ బాబు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత

జవహర్ బాల మంచ్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్తపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పోలీస్ అధికారులతో కలిసి “మత్తు పదార్థాలకు నో చెప్పండి” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. ఉపాధ్యాయులకు సన్మానం

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా అలకుంట రాజేశం మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తు.. వారి ఆరోగ్యం, విద్య, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు రాణించాలని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆరోగ్య, విద్యాభివృద్ధికి జవహర్ బాల మంచ్ తరఫున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సి ఐ. కృష్ణ కుమార్ ఏస్ ఐ ఉదయ్ కిరణ్,అంతర్గాం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగం కిరణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల మహేష్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, డీసీసీ ప్రధాన కార్యదర్శి పుదారి సత్తయ్య, అంతర్గాం సర్పంచ్ ఆంగోత్ రవికుమార్, బారుపటి శ్రీను, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లగిశెట్టి రాకేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకాంబరం, జేబీఎం రామగుండం నియోజకవర్గ నాయకుడు దొబ్బల తరుణ్ కుమార్, మండల సమన్వయకర్తలు అలకుంట శ్రీనివాస్, బానోత్ కార్తీక్ నాయక్ తదితరులు, జేబీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest