రోడ్డుపక్కన చెట్టు కొమ్మ విరిగి వ్యక్తిపై పడి తీవ్ర గాయాలు

ప్రమాదకర చెట్ల తొలగింపులో ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం ధర్మారం, (తెలంగాణ వాణి) రోడ్డుపక్కన ఉన్న చెట్టు కొమ్మ విరిగి ద్విచక్ర వాహనదారుడిపై పడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ధర్మారం మండల కేంద్రంలోని గోదావరి అర్బన్ బ్యాంక్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన మంతెన రాజు పని నిమిత్తం ధర్మారం వచ్చి తిరిగి స్కూటీపై ఎండపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని ముందు భారీ లోడుతో లక్షెట్టిపేట […]