UPDATES  

 82 వసంతాలు.. చెక్కుచెదరని జనాభిమానం!

పార్టీలకు అతీతంగా పాల్వంచలో పోటెత్తిన అభిమాన సంద్రం…

పూలవర్షం, భారీ ఊరేగింపు మధ్య ఘనంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

సుమారు పదివేల మందితో జనసమ్మేళనం…

రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పండుగ వాతావరణం

 

భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) ఎనిమిది పదుల వయస్సు దాటినా ఆ నాయకుడికి జనాభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలు మరోసారి చాటిచెప్పాయి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు వేలాదిగా తరలిరావడంతో ఆయన జన్మ స్థలమైన పాత పాల్వంచ జనసంద్రమైంది. సుమారు పదివేల మంది హాజరైన ఈ వేడుకలు రాజకీయాలకు అతీతమైన ఆత్మీయ సమ్మేళనంగా నిలిచాయి. ఉదయం నుంచే పాత పాల్వంచలో పండుగ వాతావరణం నెలకొంది. వనమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూలగుచ్ఛాలు, భారీ పూలదండలు, శాలువాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే వనమా’, ‘వనమా జిందాబాద్’ నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

 

గుర్రపు బగ్గీపై ఘన ఊరేగింపు.. పూలవర్షంతో స్వాగతం

 

జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు వనమా నివాసం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. గుర్రపు బగ్గీపై వనమా దంపతులను ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సుమారు 200 మంది కళాకారులు గిరిజన కోలాటాలు, లంబాడీ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఊరేగింపులో ఉత్సాహాన్ని నింపారు. బాణసంచా పేలుళ్లు, అభిమానుల నినాదాల మధ్య వనమా దంపతులకు ఘన స్వాగతం పలికారు. భారీ పూలదండలతో సత్కరించడంతో పాటు పూలవర్షం కురిపించారు. వేడుకల కోసం ప్రత్యేకంగా భారీ వేదికను ఏర్పాటు చేయగా, వనమా దంపతులు వేదికపై కూర్చొని వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. సభా ప్రాంగణం అభిమానులు, రాజకీయ ప్రముఖులతో కిక్కిరిసిపోయింది. అతిథుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

సర్పంచ్ నుంచి మంత్రి వరకు.. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

 

పాల్వంచ సర్పంచిగా ప్రారంభమైన వనమా రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరింది. సుమారు ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రజలతో, కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని కొనసాగించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్మికులు, కర్షకుల సమస్యలపై పోరాటాలు, నిరాహార దీక్షలు చేపట్టిన సందర్భాలను గుర్తుచేశారు. కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో వనమాకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు.

 

రాజకీయాలకు అతీతంగా ప్రముఖుల రాక

 

వేడుకల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని వనమాకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడల శ్రీనివాస రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్, రాష్ట్ర స్థానిక రాజకీయ ప్రముఖులు, ఇతర పార్టీల నాయకులు, ప్రముఖ వైద్యులు, ప్రముఖ న్యాయవదులు, సామాజిక వెత్తలు, పుర ప్రముఖులు, వ్యాపార వేత్తలు హాజరై వనమాను సత్కరించారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ పార్టీ లకు సంబందించిన వారంతా ఒకే వేదికపై కలుసుకోవడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అభిమానుల ఆదరణ చూసి భావోద్వేగానికి గురైన వనమా

 

తన జన్మదిన వేడుకలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, శ్రేయోభిలాషులను చూసి వనమా వెంకటేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గమే తన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి అని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో పది మంది ముఖ్యమంత్రుల వద్ద ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆదరణ మరువలేనిదని తెలిపారు. రాజకీయ విభేదాలే తప్ప తనకు వ్యక్తిగత శత్రువులు ఎవరూ లేరని, తనపై చూపిస్తున్న అభిమానమే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, కాలనీల ఏర్పాటు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల్లో భాగస్వామినయ్యానని వివరించారు.

అభిమానానికి చిరునామాగా నిలిచిన వేడుకలు

 

82 ఏళ్ల వయస్సులోనూ వనమాపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆత్మీయత ఈ జన్మదిన వేడుకలతో మరోసారి స్పష్టమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సందర్శకులతో పాత పాల్వంచ సందడిగా మారింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వనమా దంపతులు శుభాకాంక్షలు స్వీకరించారు. వనమా కుటుంబ సభ్యులు వేడుకలకు విచ్చేసిన నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా ఈ వేడుకలు కేవలం జన్మదిన సంబరాలకే పరిమితం కాకుండా ఐదు దశాబ్దాల రాజకీయ అనుబంధాలు, అభిమానుల ఆత్మీయతకు వేదికగా నిలిచాయి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 1 November 2026, 6:25 pm Posted by : TELANGANA VANI

82 వసంతాలు.. చెక్కుచెదరని జనాభిమానం!

పార్టీలకు అతీతంగా పాల్వంచలో పోటెత్తిన అభిమాన సంద్రం...

పూలవర్షం, భారీ ఊరేగింపు మధ్య ఘనంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

సుమారు పదివేల మందితో జనసమ్మేళనం...

రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పండుగ వాతావరణం

 

భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) ఎనిమిది పదుల వయస్సు దాటినా ఆ నాయకుడికి జనాభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలు మరోసారి చాటిచెప్పాయి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు వేలాదిగా తరలిరావడంతో ఆయన జన్మ స్థలమైన పాత పాల్వంచ జనసంద్రమైంది. సుమారు పదివేల మంది హాజరైన ఈ వేడుకలు రాజకీయాలకు అతీతమైన ఆత్మీయ సమ్మేళనంగా నిలిచాయి. ఉదయం నుంచే పాత పాల్వంచలో పండుగ వాతావరణం నెలకొంది. వనమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూలగుచ్ఛాలు, భారీ పూలదండలు, శాలువాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 'హ్యాపీ బర్త్‌డే వనమా', 'వనమా జిందాబాద్' నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

 

గుర్రపు బగ్గీపై ఘన ఊరేగింపు.. పూలవర్షంతో స్వాగతం

 

జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు వనమా నివాసం నుంచి భారీ ఊరేగింపు నిర్వహించారు. గుర్రపు బగ్గీపై వనమా దంపతులను ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సుమారు 200 మంది కళాకారులు గిరిజన కోలాటాలు, లంబాడీ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ ఊరేగింపులో ఉత్సాహాన్ని నింపారు. బాణసంచా పేలుళ్లు, అభిమానుల నినాదాల మధ్య వనమా దంపతులకు ఘన స్వాగతం పలికారు. భారీ పూలదండలతో సత్కరించడంతో పాటు పూలవర్షం కురిపించారు. వేడుకల కోసం ప్రత్యేకంగా భారీ వేదికను ఏర్పాటు చేయగా, వనమా దంపతులు వేదికపై కూర్చొని వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. సభా ప్రాంగణం అభిమానులు, రాజకీయ ప్రముఖులతో కిక్కిరిసిపోయింది. అతిథుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

సర్పంచ్ నుంచి మంత్రి వరకు.. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

 

పాల్వంచ సర్పంచిగా ప్రారంభమైన వనమా రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరింది. సుమారు ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రజలతో, కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని కొనసాగించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. కార్మికులు, కర్షకుల సమస్యలపై పోరాటాలు, నిరాహార దీక్షలు చేపట్టిన సందర్భాలను గుర్తుచేశారు. కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో వనమాకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు.

 

రాజకీయాలకు అతీతంగా ప్రముఖుల రాక

 

వేడుకల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని వనమాకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడల శ్రీనివాస రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్, రాష్ట్ర స్థానిక రాజకీయ ప్రముఖులు, ఇతర పార్టీల నాయకులు, ప్రముఖ వైద్యులు, ప్రముఖ న్యాయవదులు, సామాజిక వెత్తలు, పుర ప్రముఖులు, వ్యాపార వేత్తలు హాజరై వనమాను సత్కరించారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ పార్టీ లకు సంబందించిన వారంతా ఒకే వేదికపై కలుసుకోవడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అభిమానుల ఆదరణ చూసి భావోద్వేగానికి గురైన వనమా

 

తన జన్మదిన వేడుకలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, శ్రేయోభిలాషులను చూసి వనమా వెంకటేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గమే తన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి అని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో పది మంది ముఖ్యమంత్రుల వద్ద ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆదరణ మరువలేనిదని తెలిపారు. రాజకీయ విభేదాలే తప్ప తనకు వ్యక్తిగత శత్రువులు ఎవరూ లేరని, తనపై చూపిస్తున్న అభిమానమే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, కాలనీల ఏర్పాటు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల్లో భాగస్వామినయ్యానని వివరించారు.

అభిమానానికి చిరునామాగా నిలిచిన వేడుకలు

 

82 ఏళ్ల వయస్సులోనూ వనమాపై ప్రజల్లో ఉన్న అభిమానం, ఆత్మీయత ఈ జన్మదిన వేడుకలతో మరోసారి స్పష్టమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సందర్శకులతో పాత పాల్వంచ సందడిగా మారింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వనమా దంపతులు శుభాకాంక్షలు స్వీకరించారు. వనమా కుటుంబ సభ్యులు వేడుకలకు విచ్చేసిన నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా ఈ వేడుకలు కేవలం జన్మదిన సంబరాలకే పరిమితం కాకుండా ఐదు దశాబ్దాల రాజకీయ అనుబంధాలు, అభిమానుల ఆత్మీయతకు వేదికగా నిలిచాయి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest