UPDATES  

 సంప్రదాయబద్ధంగా అట్లతద్ది వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 29 (తెలంగాణ వాణి): టేకులపల్లి మండలంలో అట్లతద్ది వేడుకలు గురువారం ఘనంగా ముగిశాయి. ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణం, బస్టాండ్‌ సెంటర్‌ వద్ద మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ గౌరీదేవికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. గోరింటాకు పెట్టుకుని, సంప్రదాయ పిండి వంటలు తయారు చేసుకున్నారు. తంగేడు పూలతో గౌరీదేవిని అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం ఉయ్యాలలు ఊగుతూ జానపద గేయాలు ఆలపించారు. ముత్తైదువులకు అట్లు, పండ్లు వాయనంగా అందజేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మహిళల ఉత్సాహం, సంప్రదాయ ఆటపాటలతో మండలంలో పండుగ వాతావరణం నెలకొంది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 October 2026, 7:50 am Posted by : TELANGANA VANI

సంప్రదాయబద్ధంగా అట్లతద్ది వేడుకలు

టేకులపల్లి, అక్టోబర్ 29 (తెలంగాణ వాణి): టేకులపల్లి మండలంలో అట్లతద్ది వేడుకలు గురువారం ఘనంగా ముగిశాయి. ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణం, బస్టాండ్‌ సెంటర్‌ వద్ద మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ గౌరీదేవికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. గోరింటాకు పెట్టుకుని, సంప్రదాయ పిండి వంటలు తయారు చేసుకున్నారు. తంగేడు పూలతో గౌరీదేవిని అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం ఉయ్యాలలు ఊగుతూ జానపద గేయాలు ఆలపించారు. ముత్తైదువులకు అట్లు, పండ్లు వాయనంగా అందజేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మహిళల ఉత్సాహం, సంప్రదాయ ఆటపాటలతో మండలంలో పండుగ వాతావరణం నెలకొంది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest