UPDATES  

 జూలూరుపాడును కరువు ప్రాంతంగా ప్రకటించాలి

రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: సీపీఐ నేత వెంకటేశ్వర్లు

జూలురుపాడు (తెలంగాణ వాణి) మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై సిపిఐ జూలూరుపాడు మండల సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, కరువు ప్రభావిత ప్రాంతాల గుర్తింపులో జూలూరుపాడు మండలాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని వ్యవసాయ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, అర్హత ఉన్న ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రైతుల జీవనోపాధికి సంబంధించిన ఇంత కీలకమైన అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఒకవైపు రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరోవైపు కరువు ప్రభావిత ప్రాంతాల గుర్తింపులో జూలూరుపాడు మండలానికి న్యాయం జరగకపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలోని వాస్తవ పరిస్థితులపై సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించే అంశంపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలని, పంట నష్టపోయిన అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించాలని, రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రైతుల ఇబ్బందులను నిర్లక్ష్యం చేయడం తగదని, జూలూరుపాడు మండల రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని డిమాండ్ చేశారు. ఈ సమవేషంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, ఎల్లంకి మధు పొనేకంటి వెంకటేశ్వర్లు వలమల్ల సామేలు. చీమకుర్తి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 October 2026, 12:20 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest