UPDATES  

  • మారుమూల పల్లె నుండి జాతీయస్థాయికి ఎదిగిన విద్యార్థిని విద్యార్థులు…
  • జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు..
  • పెండ్యాల సహస్ర, గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ ఎంపిక!
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోర్లికొండకు చెందిన ముగ్గురు విద్యార్థిని, విద్యార్థుల ప్రతిభ!!

అక్టోబర్ 28 (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్ టి.ఎన్ రమేష్) జాతీయ మినీ సబ్ జూనియర్ (అండర్-13) సాఫ్ట్‌బాల్ పోటీలకు, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం, తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ముగ్గురు, జాతీయ మినీ సబ్ జూనియర్ (అండర్ – 13) సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పెండ్యాల సహస్ర, గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల అంతర్‌జిల్లా పోటీల్లో పెండ్యాల సహస్ర ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా, అక్టోబర్ 16, 17 తేదీల్లో హనుమకొండలోని ఎల్‌బీ కళాశాల మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర అంతర్‌జిల్లా పోటీలలో గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్, నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.ఈ ముగ్గురు విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. అక్టోబర్ 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని కోపర్‌గావ్‌లో గల సంజీవని యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి మినీ సబ్ జూనియర్ (అండర్-13) సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. అని జక్రంపల్లి ఎంఈఓ శ్రీనివాస్ తెలిపినారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదగడం పాఠశాలకు, జిల్లాకు గర్వకారణమని వారు హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరింతమంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్ది పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని పేర్కొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 28 October 2026, 8:27 am Posted by : TELANGANA VANI

మారుమూల పల్లె నుండి జాతీయస్థాయికి ఎదిగిన విద్యార్థిని విద్యార్థులు...
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు..
పెండ్యాల సహస్ర, గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ ఎంపిక!
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోర్లికొండకు చెందిన ముగ్గురు విద్యార్థిని, విద్యార్థుల ప్రతిభ!!

అక్టోబర్ 28 (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్ టి.ఎన్ రమేష్) జాతీయ మినీ సబ్ జూనియర్ (అండర్-13) సాఫ్ట్‌బాల్ పోటీలకు, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం, తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ముగ్గురు, జాతీయ మినీ సబ్ జూనియర్ (అండర్ - 13) సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన పెండ్యాల సహస్ర, గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్ జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోర్లికొండ క్రీడా మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల అంతర్‌జిల్లా పోటీల్లో పెండ్యాల సహస్ర ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా, అక్టోబర్ 16, 17 తేదీల్లో హనుమకొండలోని ఎల్‌బీ కళాశాల మైదానంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర అంతర్‌జిల్లా పోటీలలో గేడెం శివకుమార్, మాదరి ప్రణవ్, నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.ఈ ముగ్గురు విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. అక్టోబర్ 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలోని కోపర్‌గావ్‌లో గల సంజీవని యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి మినీ సబ్ జూనియర్ (అండర్-13) సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. అని జక్రంపల్లి ఎంఈఓ శ్రీనివాస్ తెలిపినారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు జాతీయ స్థాయికి ఎదగడం పాఠశాలకు, జిల్లాకు గర్వకారణమని వారు హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరింతమంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్ది పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని పేర్కొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest