ఇద్దరు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు.. కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు
చేర్యాల, అక్టోబర్ 27 (తెలంగాణ వాణి):
రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ జట్టుకు చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. అక్టోబర్ 26న మద్దూరులో నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై సత్తా చాటారు.కళాశాలలో సీఈసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న హేమచంద్ర, ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి బాలగాని నాగచైతన్య తమ క్రీడా నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరిద్దరూ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎ. జ్యోతి విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు ఎ. వెంకటేశ్వర్లు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి. రవి, డి. అరుణ్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.





