UPDATES  

 వేములవాడ డివిజన్ లో ఆఖరి దశకు ‘సర్’ ప్రక్రియ

వేములవాడ,అక్టోబర్ 08 (తెలంగాణ వాణి ప్రతినిధి) :​వేములవాడ డివిజన్ లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ 98 శాతం పూర్తయి చివరి దశకు చేరిందని వేములవాడ ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 2,29,132 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనలో 2,02,323 మంది అర్హులుగా తేలారని తెలిపారు. మిగిలిన 26,809 మందిలో డబుల్ ఓట్లు ఉన్నవారు, మృతిచెందినవారు, ఇతర ప్రాంతాలకు మారిన (షిఫ్టెడ్) వారు అనర్హులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.​క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజు ముగిసిందని, వచ్చిన దరఖాస్తులను నవంబరు 5వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నవంబరు 9న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు తెలిపారు. అయితే కొత్తగా ఓటు నమోదు, సవరణల కోసం ఉపయోగించే ఫారం 6, 7, 8 ప్రక్రియలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఏలు, బిఎల్ఓలు మరియు ఎన్నికల సిబ్బందికి ఆర్డీఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు పొలాస నరేందర్, మైలారం రాము, కడారి రాములు, చింతలకోటి రామస్వామి గౌడ్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 October 2026, 3:04 pm Posted by : TELANGANA VANI

వేములవాడ డివిజన్ లో ఆఖరి దశకు ‘సర్’ ప్రక్రియ

వేములవాడ,అక్టోబర్ 08 (తెలంగాణ వాణి ప్రతినిధి) :​వేములవాడ డివిజన్ లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ 98 శాతం పూర్తయి చివరి దశకు చేరిందని వేములవాడ ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 2,29,132 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనలో 2,02,323 మంది అర్హులుగా తేలారని తెలిపారు. మిగిలిన 26,809 మందిలో డబుల్ ఓట్లు ఉన్నవారు, మృతిచెందినవారు, ఇతర ప్రాంతాలకు మారిన (షిఫ్టెడ్) వారు అనర్హులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.​క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజు ముగిసిందని, వచ్చిన దరఖాస్తులను నవంబరు 5వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నవంబరు 9న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు తెలిపారు. అయితే కొత్తగా ఓటు నమోదు, సవరణల కోసం ఉపయోగించే ఫారం 6, 7, 8 ప్రక్రియలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ విజయవంతానికి సహకరించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఏలు, బిఎల్ఓలు మరియు ఎన్నికల సిబ్బందికి ఆర్డీఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు పొలాస నరేందర్, మైలారం రాము, కడారి రాములు, చింతలకోటి రామస్వామి గౌడ్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest