UPDATES  

 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నేత- కాక

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) దివంగత మాజీ కేంద్రమంత్రి ప్రజల మనిషి గడ్డం వెంకటస్వామి (కాక) 97వ జయంతి వేడుకలను సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు లావుడ్య రూప్లా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 97వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్లారని. కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని స్మరించుకున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై కాకా గలం బలంగా వినిపించారని గుర్తుచేసుకున్నారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి కాక విశేష సేవలు అందించారని నాయకులు పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కాక ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే ఘనమైన నిజమైన నివాళి అని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొడారి హమ్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ మేడ వేణి తిరుపతి, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ లు అరిగే లింగయ్య, కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు దాగేటి ఉదయ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, నాయకులు బద్దం అజయ్ పాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం, నాయకులు ఓరెమ్ చిరంజీవి, జనగామ తిరుపతి, దేవి కిషోర్, కంసాని ఎల్లయ్య, లావణ్య తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, కాక అభిమానులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 5 October 2026, 1:35 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest