UPDATES  

 ఆఖరి మజిలీకి అవమానం.. స్మశానవాటికలో చెత్త కుప్పలు

దారంతా వ్యర్థాలే.. దింపుడు కళ్లెం ప్రాంతంలో దుర్వాసన

ఆప్తుల అంతిమ సంస్కారాలకూ తప్పని అవస్థలు.. పట్టించుకోని పాలకులు, అధికారులు

కొత్తగూడెం, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి) మనిషి జీవన ప్రస్థానంలో ఆఖరి మజిలీ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం బ్రిడ్జి సమీప స్మశానవాటిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అంతిమ సంస్కారాల కోసం వచ్చే ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాల్సిన చోట చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. స్మశానవాటికకు వెళ్లే దారి మొదలుకుని అంతిమ సంస్కారాల్లో కీలక ఘట్టంగా భావించే దింపుడు కళ్లెం నిర్వహించే ప్రాంతం వరకు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణ లోపించడం వల్ల చెత్త తొలగింపు సక్రమంగా జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు.

దుఃఖంలోనూ దుర్వాసనతో అవస్థలు

ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉండే సమయంలో అంతిమ సంస్కారాలకు స్మశానవాటికకు వస్తారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో అడుగడుగునా చెత్త, దుర్వాసన కనిపించడం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. కనీసం చివరి వీడ్కోలు సమయంలోనైనా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు.

మానవీయ కోణంలో స్పందించాలి

స్మశానవాటికను క్రమం తప్పకుండా శుభ్రం చేయడంతో పాటు అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వ్యర్థాల తొలగింపు, మురుగునీటి సమస్య పరిష్కారం, పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతిమ సంస్కారాలకు వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం కార్పొరేషన్ పాలకవర్గం, అధికారులు మానవీయ కోణంలో స్పందించి స్మశానవాటికను పరిశుభ్రంగా, గౌరవప్రదంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 28 September 2026, 7:07 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest