UPDATES  

NEWS

 శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జగిత్యాల/వెల్గటూర్, సెప్టెంబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి) విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డి. షహిదొద్దీన్ అన్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.డి. షహిదొద్దీన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల జీవితాల్లో ఎంతో కీలకమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని అధిరోహించి దేశానికి సేవలందించారని తెలిపారు. వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్, కృపాకర్, వనజ, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమ, అంజలి, గౌతమి, సంధ్య, మల్లీశ్వరి, అండాల్, సాత్విక, కళ్యాణి, సునీత, సాహితీ, అనూష, రంజిత, సువర్ణ, స్వప్న, శిరీష, అనితతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Date of Publish : 6 September 2026, 3:52 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest