UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాము టైమ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని వివరించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఖాళీల వివరాలు గెజిట్ నోటిఫికేషన్ నిన్న(ఆదివారం) తమకు అందిందని వెల్లడించారు. ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారిగా పబ్లిష్ చేశామని తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ అధికారులు ప్రక్రియ పూర్తి చేశారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest