UPDATES  

NEWS

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం

 పోలీసుల అదుపులో పది మంది మావోయిస్టు అగ్రనాయకులు

ప్రాణ హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పర్చాలి

తెలంగాణ పౌరహక్కుల సంఘం

హైదరాబాద్ జూన్ 06 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) చత్తీస్ ఘఢ్ పోలీసుల అదుపులో మావోయిస్ట్ నాయకులు ఉన్నారంటూ వారికి ప్రాణ హాని తలపెట్టే ప్రమాదం వుందని, వారందరినీ కోర్టులో హాజరుపర్చి రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలు కాపాడలంటూ తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న డిసి మెంబర్, మున్నా సునీత మహేష్ లతో పాటు పది మంది మావోయిస్ట్ నాయకులు ఉన్నారని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవి ప్రాంతంలోని ఒక గ్రామంలో గురువారం రోజున మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ సుధాకర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబెర్ మైలారపు ఆడేళ్ళు అలియాస్ భాస్కర్, బండి ప్రకాష్ నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్ మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డిసి మెంబర్, మున్నా, సునీత మహేష్ లతో పాటు పది మంది మావోయిస్ట్ నాయకుల ను పోలీసులు ప్రాణాలతో పట్టుకొన్నారని అందులో సుధాకర్ ను ఎన్ కౌంటర్ పేరున హత్య చేశారని, మరునాడు శుక్రవారం రోజున సాయంత్రం భాస్కర్ ను కూడా ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేశారని, ఇంకా వారి అదుపులోని బండి ప్రకాష్ మిగతా మావోయిస్టు నాయకులను చిత్రహింసలకు గురిచేస్తూ ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసే ప్రమాదముందని వారికి ఎలాంటి హాని తల పెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పర్చాలంటూ తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ప్రాణాలతో దొరికిన దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్ కౌంటర్ పేరుతో హతమార్చడం రాజ్యాంగ విరుద్ధం చట్ట వ్యతిరేకమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని తెలిపారు.అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం తరుపున డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest