UPDATES  

NEWS

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

 సినీనటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలి : అఫ్జల్ పఠాన్

మీది అహంకారామా ? అసహనమా ?
మీ ఇంటి రచ్చను మీరే రోడ్డున పడేసి మీడియాపై ఆగ్రహం ఎందుకు ?

హైదరాబాద్ (తెలంగాణ వాణి)

సినీ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ అఫ్జల్ పఠాన్ డిమాండ్ చేశారు. మీడియాపై మంచు మోహన్ బాబు దాడిచేయడం ఆయన విలువను దిగజార్చుతుందని మోహన్ బాబు  క్షమాపణ చెప్పకపొతే మీడియా అంటే ఏంటో ఆయనకు తెలిసేలా చేస్తామన్నారు. గత 3 రోజులుగా సినీ ఇండస్ట్రీతో పాటు, 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న మీ మంచు వారి ఇంటి గొడవ రోడ్డున పడేసింది మీరే కదా ? బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చుని మీడియా కు లీకులు ఇచ్చింది ఎవరు?… ఈరోజు ప్రత్యక్షంగా అక్కడేం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు చూపించే క్రమంలో మీడియా వస్తే పిల్లల్ని అదుపులో పెట్టుకోలేని అసహనాన్ని, మిమ్మల్ని ఎదిరించిన మీ కొడుకుపై ఆగ్రహాన్ని మీడియా పై చూపిస్తారా ఇదేనా మీ సంస్కారం. ఇండస్ట్రీకి పెదరాయుడిని నేనే, నా ముందు అందరు తక్కువే అంటూ ఢాంబికాలు పలికే మీరు మీ పెద్దరికాన్ని, హుందాతనాన్ని నిలుపుకోవాలంటే తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest