అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన ఫారెస్ట్ సిబ్బంది
లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి)
అనిశెట్టిపల్లి ముర్రేడు వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డ ట్రాక్టర్ విషయంలో ట్విస్ట్ నెలకొంది… లక్ష్మిదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పట్టుకున్నారు.
అయితే ఎప్పటి లాగే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ను సెంట్రల్ పార్క్ లేదా ఎఫ్.డి.ఓ కార్యాలయంలో ఉంచాల్సి ఉండగా ట్రాక్టర్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎక్కడికి తీసుకెళ్లారు. ఎవరైనా తప్పించారా అన్న సమాచారం తెలియడం లేదు. ఈ ఘటనలో భారీ స్థాయిలో తెర వెనుక మంతనాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Post Views: 55