UPDATES  

NEWS

 తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా

తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా

కంగ్టి పిట్లం రోడ్డు పై బైఠాయించిన రైతన్నలు,నిలిచిన వాహనాలు

 

సంగారెడ్డి,కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి )

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నలు కంగ్టి పిట్లం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు గోనే సంచుల,లారీల కొరతతో,అకాల వర్షానికి జొన్నలు తడిసి మొలకెత్తడంతో రైతులు ఆందోళన చెంది ధర్నా నిర్వహించి,ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు.లారీల కొరత గోనే సంచుల కొరతను తీర్చాలని రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వానికి,ప్రభుత్వ అధికారులకు, డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించిన రైతన్నలను కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి,మాట్లాడి ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాలను పునరుద్ధరించారు.ఈ కార్యక్రమంలో తడ్కల్ పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest