UPDATES  

NEWS

 జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

నివేషణ స్థలాల కోసం త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి 
అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలి
జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా

చందుర్తి,ఆగస్టు 16 (తెలంగాణ వాణి ప్రతినిధి) :

జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయించే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. ఆదివారం చందుర్తిలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని లాయక్ పాషా పేర్కొన్నారు. సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం కూడా ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం సాధించే వరకు టీయూడబ్ల్యూజే పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా యూనియన్‌ను మరింత బలోపేతం చేసి జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం టీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల తిరుమల్, వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ,సభ్యులు రహీం,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 16 August 2026, 8:34 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest