UPDATES  

NEWS

 విద్యతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డిఈఓ అశోక్

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

కన్నుల పండుగగా సెయింట్ జేవియర్ 42వ వార్షికోత్సవం

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ తెలిపారు జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులో గల సెయింట్ జేవియర్ పాఠశాల 42వ వార్షికోత్సవం కన్నుల పండుగగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి రెడ్డి,లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఓ అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు తంలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు మేదో శక్తిని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. చిన్న తనము నుండే నాన్యమైన విద్యను అందుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు బాల్య దశ నుండే విద్యా ప్రాముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిలో క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యమైందని క్రమశిక్షణ కలిగిన విద్యార్థి అన్ని రంగాలలో రాణిస్తారని అన్నారు. విద్యతోపాటు ఆటలలో ను ప్రతిభను కనపరిచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాలని సూచించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి సాయి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదనీ చిన్న దశ నుండే చదువుపై శ్రద్ధ వహించి ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు విద్యార్థులు మంచి పేరును తీసుకు రావాలనీ ఆయన ఆకాంక్షించారు. పాఠశాలకు మంచి వచ్చే విధంగా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగితే ఆ పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తారని అన్నారు. పాఠశాల చైర్మన్ చేతుల మీదుగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులు కనపరిచిన సంస్కృతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. సంస్కృతి కార్యక్రమాల్లో చిన్నారులు అలరించిన రాజస్థాన్ జోధ్ పూర్ నృత్యం తోపాటు శివ కళ్యాణం అదే విధంగా చిన్నపిల్లలు మొబైల్ వాడకంపై నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, త్రిబుల్ ఆర్ మూవీ నీ ఆరు నిమిషాల్లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, డైరెక్టర్ పాకాల పుష్ప, ప్రధాన ఉపాధ్యాయురాలు లతా గౌడ్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానందం, అర్బన్ అధ్యక్షులు ధర్మరాజు, అర్బన్ సెక్రటరీ శ్రీనివాస్ కోశాధికారి నాగరాజ్, ట్రస్మ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్, రాష్ట్ర అడ్వైజర్ మోహన్, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest