UPDATES  

NEWS

వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు

 పోలీసుల అదుపులో దారి తప్పిన గురువు

పిల్లల పట్ల పైత్యపు చేష్టలు

తల్లితండ్రుల ఆగ్రహం

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కనీ పెంచినప్పటికీ.. వారికి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండేలా చేసేది గురువులు మాత్రమే.

అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించేవారే ఉపాధ్యాయులు. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. పాఠశాలకు మద్యం సేవించి రావడం, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థులను లైంగికంగా వేధించడం లాంటివి చేస్తున్నారు. కాగా శుక్రవారం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ టీచర్ ని కొత్తగూడెం 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం, పోస్టాఫీసు సెంటర్ వద్ద గల సింగరేణి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విధ్యార్ధినులను తెలుగు ఉపాధ్యాయుడు వేణు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, గిచ్చుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నడాని ఆరోపిస్తూ విధ్యార్ధునుల కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టగా రంగంలోకి దిగిన 1వ టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఉపాధ్యాయుడు వేణు ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest