UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష

కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ( ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి) ఎస్.సరిత సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా…. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామము కు చెందిన ఇడ్డీ రంగా తన ఫిర్యాదులో 2019 మార్చి 19 న బూర్గంపాడు పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదులో తన తమ్ముడు ఇడి భాస్కర్ తన మరదలు అరుణలు మరణించిన కారణంగా వారి మైనర్ పిల్లలు కుమార్తె ,కుమారుడు తన […]

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం

2026 మార్చి 5వ తేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమ్ ఆదిత్య వివాహ వేడుకల ఆహ్వాన పత్రికను జూలూరుపాడు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గుగులోతు ప్రియాంక నాయక్ గారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్, మండల సేవాదళ్ అధ్యక్షులు వాంకుడోత్ కిషన్ నాయక్, ఓబీసీ మండల అధ్యక్షులు గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం

కొత్తగూడెం లీగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ,న్యాయరంగంలో అనుభవం కలిగిన రమేష్ కుమార్ పార్టీ లీగల్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.మానవ హక్కుల పరిరక్షణ,బలహీన వర్గాలకు న్యాయ […]

ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ.జయంతి

ఏన్కూర్ ఫిబ్రవరి 23: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను సోమవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సంత్ శ్రీ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండార్ పూజా కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డిఎస్.నాగేశ్వరరావు పాఠశాల విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో పయనిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని […]

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ అండ్ బి ఆర్ ఎస్ నాయకులు

కొత్తగూడెం నగరపాలక సంస్థలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్ నాయక్‌ను పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్, పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, పార్టీ నాయకుడు వాసుమల్ల గౌతమ్ తదితరులు మేయర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు […]

ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలి

టీపీసీసీ చీఫ్ కు మున్నూరు కాపు కులస్తుల వినతి గాంధీభవన్ కు భారీగా తరలిన మున్నూరు కాపు ప్రతినిధులు. నిజామాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలని మున్నూరు కాపు కులానికి చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ కు తరలి వెళ్లారు. టిపిసిసి అధ్యక్షులు […]

ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు   ఉట్నూర్ (తెలంగాణ వాణి) ఉట్నూర్ మండల షాంపుర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను […]