మీది అహంకారామా ? అసహనమా ?
మీ ఇంటి రచ్చను మీరే రోడ్డున పడేసి మీడియాపై ఆగ్రహం ఎందుకు ?
హైదరాబాద్ (తెలంగాణ వాణి)
సినీ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ అఫ్జల్ పఠాన్ డిమాండ్ చేశారు. మీడియాపై మంచు మోహన్ బాబు దాడిచేయడం ఆయన విలువను దిగజార్చుతుందని మోహన్ బాబు క్షమాపణ చెప్పకపొతే మీడియా అంటే ఏంటో ఆయనకు తెలిసేలా చేస్తామన్నారు. గత 3 రోజులుగా సినీ ఇండస్ట్రీతో పాటు, 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న మీ మంచు వారి ఇంటి గొడవ రోడ్డున పడేసింది మీరే కదా ? బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చుని మీడియా కు లీకులు ఇచ్చింది ఎవరు?… ఈరోజు ప్రత్యక్షంగా అక్కడేం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు చూపించే క్రమంలో మీడియా వస్తే పిల్లల్ని అదుపులో పెట్టుకోలేని అసహనాన్ని, మిమ్మల్ని ఎదిరించిన మీ కొడుకుపై ఆగ్రహాన్ని మీడియా పై చూపిస్తారా ఇదేనా మీ సంస్కారం. ఇండస్ట్రీకి పెదరాయుడిని నేనే, నా ముందు అందరు తక్కువే అంటూ ఢాంబికాలు పలికే మీరు మీ పెద్దరికాన్ని, హుందాతనాన్ని నిలుపుకోవాలంటే తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.