UPDATES  

NEWS

ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ. జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్. బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్ గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు. మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం హర్షనీయం:సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్. పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్  పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి)

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని మిగిద్దో మినిస్ట్రీస్ చర్చికితో పాటు పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం ద్రాత్రుత్వమనే సుగుణాల ఆచరణలో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆయన గొప్ప దేవుడనికొనియాడారు, ఆయన కృప ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి కి ఉండాలని కోరారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. శాసనసభ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. పాస్టర్ దేవి జాన్ నెల్సన్ ప్రపంచ శాంతిని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ తోడేటి రాజ లింగయ్య గౌడ్, ఓరెమ్ చిరంజీవి, బెక్కం జనార్ధన్, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest