UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 అన్ని శాఖల సమన్వయంతో విజయవంతముగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డిఐఈఓ ను అభినందన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినందుకు డీ ఐ ఈ వో తిరుమల పూడి రవికుమార్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో డిఐఈఓ తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ఇంటర్ విద్య అధికారితో పాటు పరీక్షల నిర్వహణ కమిటీని అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అంద చేశారు కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియోదిన్, అస్లాం, హై పవర్ కమిటీ శ్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా పరీక్షల విభాగంకు విద్యుత్ శాఖ, ఆర్టీసీ, ఆరోగ్యశాఖ, పోస్టల్, శాఖ, పోలీస్ శాఖ మున్సిపల్, గ్రామ పంచాయతీ, విభాగాలు సహకరంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.అలాగే అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఎప్పటికప్పుడు తమకు సహకరిస్తూ అన్ని విభాగాలను సమన్వయం చేసి తమను ఇంటర్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest