జగిత్యాల (తెలంగాణ వాణి)
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణకు గురయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. జీవన్ రెడ్డికి కుడి భుజం లాంటి మారు గంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా కావలసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సొంత సోదరడుగా భావించే జాప్తాపూర్ గ్రామానికి చెందిన మారు గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం పక్కా ప్రణాళిక ప్రకారం హత్యకు గురి కాగా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.ముందుగా నిందితులో వేరే కారులో వచ్చి మృతుని కారుతో గుద్ది ఆపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చి వేరే కారులో పరారయ్యారు.పోలీసుల వైఫల్యం వలన గంగారెడ్డి హత్య జరిగిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో కలిసి నిరసనకు దిగారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజకీయ కక్షలతో జరిగిన హత్యగా ఆరోపిస్తున్నారు అధికార పార్టీ కార్యకర్త హత్య జరగడం వెనుక ప్రతిపక్ష పార్టీ రాజ్యం అధికార పార్టీలో నడుస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడుతున్నారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఇక పార్టీని కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకుంటామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.