UPDATES  

NEWS

ఎస్సై యుగంధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ, మార్కెట్ వైస్ చైర్మన్

వనపర్తి/పెద్దమందడి (తెలంగాణ వాణి) వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని నూతన ఎస్సై యుగంధర్ రెడ్డిని మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సదా అందుబాటులో ఉండి అమూల్యమైన సేవలు అందించాలని, పోలీస్ బృందానికి మండల ప్రజలు అందరం సహకరించాలన్నారు. వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు గట్టు యాదవ్, అల్వాల మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్ రెడ్డి, […]

వాడవాడలా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరపండి

21న హైద్రాబాద్లో రాష్ట్ర స్థాయి తెలంగాణ విలీన దినోత్సవ సభ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి) కొత్తగూడెం నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల వైపు నడిపించి తెలంగాణకు విముక్తి కలిగించి విశాల భారతంలో విలీనం చేసిన నాటి కమ్యూనిస్టు పోరాట యోధులు, అమరవీరులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 11 నుంచి 17వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా […]

చెగ్గం సునందినికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర  తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న చెగ్గం సునందినికి గంగపుత్రకు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర శుభాకాంక్షలు తెలిపారు.  భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చెగ్గం సునందిని గంగపుత్ర జిల్లా కలెక్టర్ విద్యశాఖ అధికారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం […]

జగిత్యాల జైత్రయాత్రకు 46 ఏళ్లు

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు తెచ్చుకోవల్సిందే. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాలకు ఆ జైత్రయాత్రే నాంది పలికింది. ఎలాంటి సమా చార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటుకు చేరిన రోజు సరిగ్గా 46 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ చరిత్రలో […]

ఇంటి పైకప్పు కూలి మహిళా మృతి

టేక్మాల్ (తెలంగాణ వాణి ప్రతినిధి) మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో శనివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి టేక్మాల్ గ్రామానికి చెందిన మంగలి శంకరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 2 లక్షల 11 వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ […]

ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త

బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు […]

పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి కోటి పారితోషకం, గ్రూప్-2 ఉద్యోగం

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ […]

150 గణేష్ విగ్రహాల పంపిణీ చేసిన డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్

కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది) నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత ఉత్సవాలు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు. యువత దైవభక్తి మార్గంలో నడవాలని నియోజకవర్గ వ్యాప్తంగా 150 వినాయక విగ్రహాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ నాయుడు, వెంకన్న, శ్రీకాంత్, వెంకటేష్ బాబు, వంగవీటిశ్రీను, నాగేంద్ర చారి, పవన్, ఠాకూర్ నాయక్, జనార్దన్ రావు, […]

దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలి

జయశంకర్ భూపాలపల్లి (తెలంగాణ వాణి ప్రతినిధి) దిగజారుడు రాజకీయాలకు ఆధ్యుడు హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అని, అలాంటి దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి హెచ్చరించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందంటూ తప్పుడు కూతలు కోస్తున్న కౌశిక్ […]

తెలంగాణ వాణి కథనానికి స్పందన

మల్హర్రావు (తెలంగాణ వాణి) మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని తెలంగాణ వాణి దినపత్రికలో ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిచరణ్ గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది.