UPDATES  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం (UPA) ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బిక్షపతి, ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సోమయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు లోగాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజ్ మోహన్‌లు క్యాలెండర్‌ను ఆవిష్కరించగా, అనంతరం వాటిని జిల్లా కమిటీ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో సంఘ కమిటీలను పునఃసంఘటితం చేస్తున్నామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి సభ్యులు కమిటీ ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.సంఘం క్లబ్‌ల ద్వారా సభ్యత్వాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.జిల్లా అధ్యక్షులు లోగాని శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ సభ్యులు ఐక్యతతో ముందుకు సాగుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘాన్ని బలపర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ATEC రాష్ట్ర కోశాధికారి బి.చందర్, UPA జిల్లా వైస్ ప్రెసిడెంట్లు గుమలాపురం సత్య నారాయణ,భీమవరపు మాలతి,చీకటి ప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రటరీలు వేణు మహేష్ గౌడ్,బలగం శ్రీధర్,ఎస్‌కే.నయీమ్, కొత్తగూడెం టౌన్ కమిటీ సభ్యులు జోగు కళ్యాణి, ఆశు, స్వప్న, ATEC జిల్లా వైస్ ప్రెసిడెంట్ పొగాకు మధుసూదన్ రావు, లక్ష్మీదేవి పల్లి మండలం ప్రధాన కార్యదర్శి కె.సందీప్, మహంకాళి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 January 2026, 11:25 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest