కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది)
నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత ఉత్సవాలు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు. యువత దైవభక్తి మార్గంలో నడవాలని నియోజకవర్గ వ్యాప్తంగా 150 వినాయక విగ్రహాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ నాయుడు, వెంకన్న, శ్రీకాంత్, వెంకటేష్ బాబు, వంగవీటిశ్రీను, నాగేంద్ర చారి, పవన్, ఠాకూర్ నాయక్, జనార్దన్ రావు, నియోజకవర్గ గణేష్ ఉత్సవ కమిటీ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 163