జర్నలిస్టుల ఫోరం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

31న హైదరాబాద్ లో జరిగే రజతోత్సవ వేడుకలకు జర్నలి స్టులు తరలి రండి. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపు. ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజెఎఫ్) 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ఈనెల 31న హైదరాబాద్ లో అట్టహాసంగా జరగనున్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే టి జె ఎఫ్ వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ,గృహ, పౌర సంబంధాల శాఖ […]
TUWJ H143 రజతోత్సవ వేడుకలను జయప్రదం చేద్దాం

హుజూరాబాద్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలని తీర్మానం హుజురాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూ డబ్యూ జే -హెచ్ 143 ఐజె యు) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం […]
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – 143 IJU ) హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం టీ జె ఫ్ రజతోత్సవ వేడుకలు భారీగా తరలి వెళ్లాలని తీర్మానం
హుజూరాబాద్:మే13 (తెలంగాణ వాణి) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ -H 143 IJU) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాల కృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది.ఈ సమావేశంలో జర్నలి స్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు.సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడు తూ,రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నాయకత్వంలో మే 31,2025న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయా […]
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీ నోటిఫికేషన్..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు టెక్నీషియన్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 9 మార్చి 2024 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రాంతీయ వెబ్‌సైట్ ద్వారా 8 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు RRB జారీ చేసిన నోటిఫికేషన్‌ను చదివిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం సమర్పించిన దరఖాస్తు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. […]
EDలో ఉద్యోగం ఎలా సంపాదించాలి.. విద్యార్హత ఏంటి ?

ఈ మధ్యకాలంలో ఎంతో మంది రాజకీయ నాయకులను ఈడీ అరెస్ట్ చేస్తున్న విషయం తెలసిందే. ED అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అని అంటారు. ఏదైనా కుంభకోణంలో దాడులు, అరెస్టులు జరిగినప్పుడు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేరు మాత్రమే వస్తుంది. అయితే ఈ EDలో ఉద్యోగం ఎలా పొందాలి, అర్హత ఏమిటి, ఎంపికైన అభ్యర్థికి ప్రతి నెల ఎంత జీతం లభిస్తుందో చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ED చాలా పోస్టులను డిప్యుటేషన్ […]
Central Govt Jobs:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

కేంద్ర విద్యా శాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితి లో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభమైంది.పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలున్నాయి.పోస్ట్ ను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు గా పేర్కొన్నారు.అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి వివరాల కోసం ఇది చదవండి. అర్హత: […]
OICLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఇంజనీర్, అకౌంటెంట్ సహా అనేక పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 21 మార్చి 2024 నుండి ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు 12 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ orientalinsurance.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవలసి ఉంటుంది. మొత్తం 100 ఖాళీ పోస్టులను […]
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( AIBE ) 18 పరీక్షా ఫలితాల విడుదల..

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా AIBE 18 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.comలో విడుదల చేసిన ఫలితాలను చూసుకోవచ్చు. ఈసారి 18వ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ను 10 డిసెంబర్ 2023న నిర్వహించారు. బీసీఐ మార్చి 21న పరీక్షల తుది సమాధాన కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. డిసెంబరు 12న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయగా, అభ్యర్థులు దాని […]
ఇక ‘నెట్’ స్కోర్‌తోనూ పీహెచ్‌డీ అడ్మిషన్లు

పీహెచ్‌డీ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్లను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. మార్చి 13న యూజీసీ 578వ సమావేశం ఢిల్లీ వేదికగా జరిగింది. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన నిబంధనలపై నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ఈ మీటింగ్‌లో కూలంకషంగా చర్చించి.. పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చేందుకు నెట్ స్కోరును లెక్కలోకి తీసుకోవచ్చని తీర్మానించారు. ఒకే […]
తెలంగాణ జెన్కో కీలక ప్రకటన.. పరీక్షలు వాయిదా

: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TS GENCO) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 31న జరుగాల్సిన ఏఈ మరియు కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (TS GENCO)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ (AE), […]