శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర
తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్)
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న చెగ్గం సునందినికి గంగపుత్రకు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చెగ్గం సునందిని గంగపుత్ర జిల్లా కలెక్టర్ విద్యశాఖ అధికారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ ఉపాధ్యయురాలిగా అవార్డు ప్రశంశా పత్రము అందుకున్న సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలక మండలి తరుపున కూడ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుతు సునందిని గంగపుత్ర తాను భోదించే సబ్జెక్టును సులభ పద్దతిలో విద్యార్థులకు విద్య భోదన చేస్తూ వంద శాతం ఉతీర్ణతకు కృషి చేస్తూ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట స్థాయి అవార్డులు గెలుచుకొని జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో తన బృందంతో ప్రాతినిధ్యము వహించడము పట్ల అభినందనలు తెలుపుతూ రానున్న రోజులలో మరింత అంకిత భావముతో విధులు నిర్వహిస్తు విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు కైవసము చేసుకుంటూ నిరుపేద గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేయాలనీ కోరారు