నా ఇల్లు అక్రమమైతే మీరే కూల్చేయండి
కేటీఆర్‌కు పొంగులేటి సవాల్ హైదరాబాద్ (తెలంగాణ వాణి) హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తన ఇల్లు ఇంచు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా టేప్ పెట్టి కొలిచి కూలగొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని కోరారు. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావు తన ఇల్లు FTL, బఫర్ జోన్లో ఉందని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. […]
కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్
న్యూఢిల్లీ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆరోగ్యం నిలకడ అయిన […]
డ్రైడే ఫ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
బెల్లంపల్లి (తెలంగాణ వాణి) డ్రై డే–ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా హనుమాన్ బస్తి -28వ వార్డులో డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చేయించారు. ఇంటీంటికి వెళ్ళి ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలిగించాలని, పాత పాత్రలలో, టైర్ లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుబ్రముగా ఉంచుకోవాలని చూచనలు చేసి, జెసిబి తో పెద్ద కాలువలు తీయించి పిచ్చి మొక్కలు తొలిగించారు. ఈ కార్యక్రమముల చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమీషనర్ కె […]
2 కోట్ల రూపాయలతో చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి
హన్మకొండ (తెలంగాణ వాణి) హనుమకొండ జిల్లా బాలసముద్రం చిల్డ్రన్ పార్కు అభివృద్ధి పనులకు రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కూడ చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు ,కూడా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
జబ్బార్ మృతి తీరని లోటు
జబ్బార్ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క ములుగు (తెలంగాణ వాణి) రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామానికి చెందిన మంత్రి సీతక్క వ్యక్తిగత సహాయకుడుగా పని చేసి ఇటీవల మరణించిన కొట్టేం వెంకటనారాయణ (జబ్బార్) ప్రథమ వర్ధంతి కి హాజరై ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు […]
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
ములుగు (తెలంగాణ వాణి) ములుగు పట్టణ కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు చిందం చందు తండ్రి చిందం రవీందర్ ప్రథమ వర్ధంతి కి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క రవీందర్ చిత్ర పటానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దారి తప్పిన గురువు
పిల్లల పట్ల పైత్యపు చేష్టలు తల్లితండ్రుల ఆగ్రహం కొత్తగూడెం (తెలంగాణ వాణి) సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కనీ పెంచినప్పటికీ.. వారికి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండేలా చేసేది గురువులు మాత్రమే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించేవారే ఉపాధ్యాయులు. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. […]
పెద్దమ్మతల్లి దేవాలయంలో వనమా రాఘవ ప్రత్యేక పూజలు
పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలోని శ్రీకనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి దేవాలయం) లో వనమా రాఘవేంద్రరావు పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వనమా రాఘవ వెంట BRSV కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల మధుచంద్, పాల్వంచ BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, వాసుమల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
అలీ కుటుంబాన్ని పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
బెల్లంపల్లి (తెలంగాణ వాణి) బెల్లంపల్లి బిఆర్ఎస్ పట్టణ మైనార్టీ ఉపాధ్యక్షులు అలి తల్లి అనారోగ్యంతో బాధప డుతు ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజి మంత్రి బోడజనార్ధన్,మాజి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సి పల్ వైస్ చైర్మన్ సుదర్శన్ లు గురువారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా పలువురు పట్టణ కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు, జనహిత సేవా సమితి సంస్థ సభ్యులు, పలు సంఘాల నాయ కులు, బెల్లంపల్లి వ్యాపార వర్తకులు, […]
ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు
భీమదేవరపల్లి (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్వర్యంలో ముల్కనూర్ లో దర్న నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పాల్గొని వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ భాగంలో 48 వేల కోట్ల బడ్జెట్లో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధించి […]