UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

ఘోర రోడ్డు ప్రమాదం RTC బస్సు బోల్తా

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు   ఉట్నూర్ (తెలంగాణ వాణి) ఉట్నూర్ మండల షాంపుర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను 108 అంబులెన్స్ ద్వారా ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను […]

మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి

జగిత్యాల, ఫిబ్రవరి 22 (తెలంగాణ వాణి): పెగడపల్లి మండలం మల్యాల వరద కాలువలో కారు పడిపోవడంతో బీఆర్ఎస్ నాయకుడు తిర్మణి రమణ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుద్ధపల్లి గ్రామానికి చెందిన తిర్మణి రమణ అనుమానాస్పద స్థితిలో కారుతో సహా మల్యాల వరద కాలువలో శవమై కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కారును బయటకు తీసి పరిశీలించగా అందులో రమణ మృతదేహం లభ్యమైంది. […]

రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి

సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి): గోనె సొలోమోన్ రాజుకు రాష్ట్ర నామినేటెడ్ కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ సామ్ కాల్వల మాట్లాడుతూ, సొలోమోన్ రాజు రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం తగిన పదవి ఇవ్వాలని సంఘం విజ్ఞప్తి చేసింది. […]

వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు

వేములవాడ: ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి): వేములవాడ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పుల్కం రాజు మరియు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నరాల శేఖర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌లను పూలమాలలతో సన్మానించి, వేములవాడ పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజల సమస్యల […]

కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ను ఘనంగా సన్మానించిన మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల.గౌతమ్,తమ్మిశెట్టి ప్రసాద్,సాయి తేజ

పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 38వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్ ను బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు వివిధ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో ఎస్‌సి మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు వాసుమల్ల గౌతమ్ ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి ప్రసాద్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బండపల్లి సర్పంచ్

ఆడపిల్లల పెళ్లికి ₹5,016 ఆర్థిక సాయం చందుర్తి, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి): చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే ₹5,016 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన ఆయన, ఆ మాట ప్రకారం మొదటి విడతగా రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. గడ్డం మమత – మనోహర్ రెడ్డి దంపతుల కుమార్తె అద్విక రెడ్డి మరియు దర్శనాల సత్తయ్య – […]

ప్రజలకు అప్రమత్తత సూచనలు

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి): వేములవాడ పట్టణ శివారులోని హన్మక్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత అడుగుల ఆనవాళ్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గస్తీ పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేములవాడ […]

కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బిజెపి

కరీంనగర్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ముఖ్యంగా కరీంనగర్ కార్పోరేషన్ లో హంగ్ ఏర్పడటం, ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాకపోవడంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఏడు కార్పోరేషన్ లలో కరీంనగర్ పీఠంను దక్కించుకునేందుకు అన్నిపార్టీలు తమదైన వ్యూహలతో ముందుకు వెళ్లిన చివరకు కాషాయ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ సొంతం చేసుకుంది. కరీంనగర్ లో 66 స్థానాలకు గాను బీజేపీ 30, […]

నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి

నిజామాబాద్ (తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశం హాల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కార్పొరేటర్లు చేతులెత్తి ఉమారాణి ని మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం 54 వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ లను ఎన్నుకున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల చేత నిజామాబాద్ ఆర్డిఓ ప్రమాణ స్వీకారం చేయించారు. […]

గెలుపు దిశగా “పల్లపోతు”

54వ డివిజన్ లో భాగ్యం ను వరించనున్న విజయం భారీ మెజార్టీ దిశగా సిపిఐ అభ్యర్థిని భాగ్యలక్ష్మి  కొత్తగూడెం (తెలంగాణ వాణి) పేరుకు తగ్గట్లుగా నే 54వ డివిజన్ సిపిఐ అభ్యర్థి భాగ్యలక్ష్మిని విజయభాగ్యం వరించనుంది. రేపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిని పల్లపోతు భాగ్యలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భాగ్యలక్ష్మి భర్త పల్లపోతు సాయి ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఆ ప్రాంత ప్రజల అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. సామాజిక వర్గాల […]