కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడా ప్రతిభ
జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో అగ్రస్థానాలు సాధించారు. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర డిస్క్ త్రోలో మొదటి స్థానం, బాలికల టేబుల్ టెన్నిస్‌లో మూడవ స్థానం, బాలుర 4×400 […]
స్మశాన వాటికలో పిచ్చి మొక్కల తొలగింపు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని న్యూ కొత్తపల్లి గ్రామంలోని స్మశాన వాటికలో రెండేళ్లుగా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్లతో అక్కడికి వచ్చే వారికి అసౌకర్యంగా ఉండటంతో గమనించిన స్థానిక సర్పంచ్ నందాల మల్లేశం, కార్యదర్శి ప్రశాంత్ తో కలిసి మంగళవారం ట్రాక్టర్ బ్లేడ్ బండితో స్మశాన వాటిక ఆవరణ చుట్టు శుభ్ర పరిచారు. ఈ పనుల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ కు సిట్ నోటిసులు కక్ష సాధింపు చర్యే

ధర్మారం (తెలంగాణ వాణి ) ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టు కథలు సృష్టించి మాజీ సిఏం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేస్తు రాజీవ్ రహదారి పై రాస్తా రోకో నిర్భహించారు. అనంతరం మాజీ సింగిల్ విండో చేర్మెన్ ముత్యాల బాలరామ్ రెడ్డి, మండల […]
కొత్తగూడెం DSP నిమర్యాదా పూర్వకంగా కలిసిన GLS JAC వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్
నూతనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం DSP గా బాధ్యతలు తీసుకున్న ఎల్ ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి GLS JAC వైస్ చైర్మన్ లావుడ్యా ప్రసాద్ నాయక్ మరియు GVS మూడ్ బాలాజీ నాయక్ ,శంకర పటేల్ తదితరులు.
సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకున్న ఎంపీడీవో జి.సుస్మితా
లక్ష్మీదేవి పల్లి గ్రామంలోని శ్రీశ్రీ సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకున్న ఎంపీడీవో గోపిశెట్టి.సుస్మితా మరియు కార్యాలయ సిబ్బంది. అమ్మవారి దర్శనానికి సంప్రదాయ మర్యాదలతో ఆహ్వానించిన గ్రామ మొదటి పౌరురాలు సర్పంచ్ తాటి అనిత. మండల ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని సమ్మక్క సారక్క అమ్మవారిని కోరుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
69వ ఎస్జిఎఫ్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

ధర్మారం (తెలంగాణ వాణి ) మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వి అఖిల, బిశ్రీజ జాతీయస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్ 19 పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. వీరు డిసెంబర్ నెలలో మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ జట్టు కు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు హిమాచల్ ప్రదేశ్ లో […]
మోగిన కార్పొరేషన్ ఎన్నికల నగార

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. రేపు జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ […]
రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ వారి ఆదేశాలనుసారం నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రచ్చపెల్లి గ్రామంలో నిర్వహించారు. ఇందు లో భాగంగా రాజమహేంద్రవరం భూపతి బ్రదర్స్ కళాజాత బృందం వారిచే వీధి నాటిక జానపద గీతాలు, మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన తెలియపరుస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక బ్రాంచ్ లలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు […]
సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్
పాల్వంచ మండలం జెడ్పీ.హెచ్.ఎస్ పునుకుల పాఠశాలలో సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సి పి ఎస్ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించిన అనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ..సి.పి.ఎస్ వల్ల తమ భవిష్యత్ భద్రతకు భంగం కలుగుతోందని,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీహరి,పాఠశాల సిబ్బంది సుజాత,అనురాధ, ప్రమీల,శ్రీపల్లవి,సునీత, బాల్య, రగ్యా,ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయితీలో రోడ్ల వెంబడి చెత్త,కాలువలు తీసిన మట్టి కుప్పలు మరియు ఇంటింటి నుండి చెత్త సేకరించడం వంటి పారిశుధ్య కార్మికులు మరియు పంచాయితీ సిబ్బంది పని తీరు బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అవగాహన కల్పిస్తున్న పంచాయతీ సర్పంచ్ తాటి అనిత మరియు ఉప సర్పంచ్ పాంచనపరుపు మహేష్,కార్యదర్శి సాంబయ్య […]